అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్‌.. 'ఈ నా కొడుకు అంటూ'.. వ‌ర్మ సంచ‌ల‌న ట్వీట్‌

Ram gopal varma sensational tweet on Allu Sirish. తాజాగా అల్లువారి చిన్న‌బ్బాయి పై వ‌ర్మ సంచ‌ల‌న ట్వీట్ చేశాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 May 2021 3:54 AM GMT
Ram gopal varma

ఒక‌ప్పుడు తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోనే కాకుండా దేశం మొత్తం గ‌ర్వించే ద‌ర్శ‌కుడిగా పేరుపొందాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. అయితే..ఇదంతా గ‌తం. ఇప్పుడు మాత్రం ఆయ‌న సినిమాల‌తో క‌న్నా.. ఏదో ఒక వివాదంతోనే సావాసం చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఎప్పుడు ఎవ‌రినో ఒక‌రిని సోష‌ల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నాడు. తాజాగా అల్లువారి చిన్న‌బ్బాయి పై వ‌ర్మ సంచ‌ల‌న ట్వీట్ చేశాడు.

ఇటీవ‌ల అల్లు శిరీష్ త‌న సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ.. కొన్ని పోటోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవి వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. తాజాగా వాటిలోని ఓ ఫోటోను వ‌ర్మ షేర్ చేయ‌డంతో పాటు సంచ‌ల‌న ట్వీట్ చేశాడు. ఈ నా కొడుకు కోనన్ ది బార్బేరియన్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ కొడుకు కాదు.. అల్లు అరవింద్ కొడుకు. అల్లు సార్.. మీ కి జోహార్ అంటూ ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. కాగా.. ఈ ట్వీట్‌పై అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ ట్వీట్‌లో ఈ నా కొడుకు అనే ప‌దం వాడ‌డంపై అభిమానులు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తున్నారు. శిరీష్ ఎవ‌రో మాకు తెలుసు.. నువ్వు ఎవ‌రి కొడుకు అంటూ కొంద‌రు కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవలే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన దెయ్యం, డి కంపెనీ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయాయి. మరోవైపు మే 30న అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.


Next Story
Share it