నిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఒకప్పుడు సినిమాలతో వార్తల్లో నిలిచే ఈ దర్శకుడు ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. తనకు సంబంధం ఉన్నా.. లేకపోయినా ఏ అంశంపైనా అయినా స్పందించడం వర్మ ప్రత్యేకత. తాజాగా ఏపీలో జరుగుతున్న పరిణాలపై తనదైన శైలిలో స్పందించాడు. 'ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతి త్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్ధం నేర్చుకోవాల్సి ఉంది' అంటూ వర్మ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి చేసిన ఆరోపణలు, వాడిన పదజాలం కారణంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు ఏపీ వ్యాప్తంగా ఉన్న టీడీపీ ఆపీస్‌పై దాడులకు పాల్పడ్డడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా బుధవారం టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈక్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. మరోవైపు పార్టీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు.. మొత్తం 36 గంటల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టారు.