ఇటీవల కాలంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడం లేదు. అయినప్పటికీ వర్మ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. చాలా మంది ఆ చిత్రంలో ఏదో ఉందని చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఇక బయోపిక్‌లకు తెరకెక్కించడంతో ఆయనకు ఆయనే సాటి. తాజాగా వర్మ ఓ కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తున్నట్లు చెప్పాడు.
నేడు ఉపేంద్ర పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఓ మోషన్ టీజర్‌ను విడుదల చేశారు. తన చిత్రానికి 'R' అనే పేరు పెట్టాడు. బెంగళూరు నగరాన్ని మాత్రమే కాకుండా ముంబైలోని మాఫియాను, దుబాయ్‌లోని డి కంపెనీని కూడా భయపెట్టే భయంకరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో భారతదేశ నేర చరిత్రలో ఒక డేర్‌డెవిల్, అత్యంత సక్సెస్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ అని అన్నారు. ఈ చిత్రానికి ఏ స్క్వేర్ ప్రొడక్షన్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రం ఎవరి బయోపిక్ అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.