మ‌రోసారి మెగాఫ్యామిలీని టార్గెట్ చేసిన వ‌ర్మ‌.. వివాదాస్ప‌ద ట్వీట్‌

Ram Gopal Varma commetns on Mega family.నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఇటీవ‌ల

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2021 10:58 AM IST
మ‌రోసారి మెగాఫ్యామిలీని టార్గెట్ చేసిన వ‌ర్మ‌..  వివాదాస్ప‌ద ట్వీట్‌

నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఇటీవ‌ల కాలంలో వ‌ర్మ సినిమాల‌తో క‌న్నా వివాదాల‌తోనే వార్త‌ల్లో నిలుస్తూ ఉన్నాడు. ఇక మెగాఫ్యాలిమీలో ఎప్పుడూ ఎవ‌రినో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వివాదాస్ప‌ద ట్వీట్లు చేయ‌డం వ‌ర్మ‌కు ఓ అల‌వాటుగా మారింది. వ‌ర్మ ట్వీట్ల‌పై మెగా ఫ్యామిలీ స్పందించ‌కున్నా కూడా వ‌ర్మ ఆగ‌డం లేదు. తాజాగా మెగాస్టార్ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌పై కూడా కామెంట్ చేశాడు. ప్ర‌స్తుతం వ‌ర్మ చేసిన ట్వీట్ వివాదాస్ప‌దంగా మారింది. ఈ ట్వీట్ పై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న ఇంట ఎంత సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొందో మ‌నం చూశాం. ఇంటి బ‌యట అభిమానుల హంగామా, ఇంట్లో మెగా ఫ్యామిలీ సంద‌డి.. వీటితో ఆ ప్రాంగ‌ణం అంతా సంద‌డిగా మారింది. వేడుకలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, నాగబాబు, మెగాస్టార్‌ కొడుకు-కోడలు రామ్‌ చరణ్‌, ఉపాసన కామినేని, కూతుళ్లు సుస్మిత, శ్రీజ వారి ఫ్యామిలీ, చిరంజీవి అక్కాచెల్లెలు, మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నిహారిక ఆమె భర్త హాజరయ్యారు. నిర్మాత అల్లు అరవింద్‌ కూడా సతీసమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. అల్లుఅర్జున్ ఒక్క‌డే ఈ వేడ‌క‌కు హాజ‌రుకాలేక‌పోయారు. ఎందుకు రాలేక‌పోయారో ఇప్ప‌టికైతే తెలీదు.

బ‌న్నీ ఎందుకు రాలేక‌పోయాడా అని అభిమానులంతా ఆందోళ‌న చెందుతున్న క్ర‌మంలో వ‌ర్మ వారిని మ‌రింత రెచ్చ‌గొట్టే విధంగా ట్వీట్ చేశాడు. మెగా ఈవెంట్‌కి హాజ‌రైన వారంద‌రు ప‌రాన్న జీవులని, బన్నీ మాత్రం రియ‌ల్ మెగాస్టార్ అంటూ కామెంట్ చేశాడు. బ‌న్నీ ఎవ‌రి అండ‌దండ‌లు లేకుండా ఈ స్థాయికి చేరుకున్నార‌ని, మిగ‌తా వారు మాత్రం చిరంజీవి స‌పోర్ట్‌తోనే ఎదిగారు అంటూ ప‌లు కామెంట్స్ చేశారు. ప్ర‌స్తుతం వ‌ర్మ చేసిన ఈ ట్వీట్ల‌పై కొంద‌రు మండిప‌డుతున్నారు. ఇక‌నైనా పుల్ల‌లు పెట్టే ప‌నిని మానుకోవాల‌ని వ‌ర్మ‌కు సూచిస్తున్నారు.

Next Story