బిగ్‌బాస్ బ్యూటీ కాళ్ల‌ను ప‌ట్టుకున్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు.. ఫోటోలు వైర‌ల్

Ram Gopal Varma chit chat with Bigg Boss fame Ashu Reddy.వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్‌గోపాల్ వ‌ర్మ‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Dec 2022 12:39 PM IST
బిగ్‌బాస్ బ్యూటీ కాళ్ల‌ను ప‌ట్టుకున్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు.. ఫోటోలు వైర‌ల్

వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్‌గోపాల్ వ‌ర్మ‌. అవ‌స‌రం ఉన్నా లేక‌పోకయినా ఎప్పుడూ ఏదో ఒక‌టి మాట్లాడుతూ కాంట్ర‌వ‌ర్సీకి తెర‌లేపుతాడు. అయితే.. ఇప్పుడు వ‌ర్మ‌కు సంబంధించిన ఫోటోలు కొన్ని సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఓ ఫోటోలో వ‌ర్మ బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డి కాళ్లు ప‌ట్టుకుని ఉన్నాడు. ఇంకో ఫోటోలో ఆమె కాళ్ల‌ను ముద్దాడాడు కూడా. ఈ ఫోటోల‌ను స్వ‌యంగా అషూరెడ్డినే తన సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో పోస్ట్ చేసింది.

'డేంజ‌ర్ ' అనే మూవీని రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించాడు. లెస్బియ‌న్ రొమాన్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో నైనా గంగూలీ, అప్స‌ర రాణిలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. బోల్డ్ కంటెంట్‌తో రూపొందించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో వ‌ర్మ త‌న‌దైన శైలిలో ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టాడు.

ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా బిగ్‌బాస్ బ్యూటీ అషు రెడ్డితో జ‌త‌క‌ట్టాడు వ‌ర్మ‌. ఓ ఇంట‌ర్వ్యూని ప్లాన్ చేశాడు. "అషు .. నేను నీ పాదాల వద్ద ఎందుకు కూర్చున్నానంటే గత ఇంటర్వ్యూలో నువ్వు నన్ను చెంపపై కొట్టడం నా బంధువులు, సన్నిహితులు బాగా కోపగించుకున్నారు. అమ్మాయిని తక్కువగా చూడటం వల్ల వారు అలా ఎమోషనల్ అయ్యారని నాకు అనిపించింది. ఎంతటి పురుష వీరుడైన కాంతలకు పాదాక్రాంతుడే అని చెప్పేందుకు నేను ఈ విధంగా కూర్చోవడం ఒక కారణం. మరో కారణమేంటంటే కింద కూర్చుని మీ కాళ్లను దగ్గరనుంచి తనివి తీరా చూడొచ్చనే ఇంకొక కుట్ర" అని ఆర్జీవీ అషూతో చెబుతాడు. ఇలా ఎన్నో విష‌యాల‌తో ఆ ఇంట‌ర్వ్యూ సాగుతుంది.

ఈ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా వ‌ర్మ త‌న కాలు ప‌ట్టుకున్న ఫోటోల‌ను అషు రెడ్డి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీనిపై నెటీజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

Next Story