కియారాకు క్ష‌మాప‌ణ చెప్పిన ఉపాస‌న‌

Ram Charan's wife Upasana apologises to newlywed Kiara.బాలీవుడ్ ప్రేమ‌జంట కియారా అడ్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రా మంగ‌ళ‌వారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Feb 2023 12:15 PM IST
కియారాకు క్ష‌మాప‌ణ చెప్పిన ఉపాస‌న‌

బాలీవుడ్ ప్రేమ‌జంట కియారా అడ్వాణీ-సిద్ధార్థ్ మల్హోత్రా మంగ‌ళ‌వారం రాజ‌స్థాన్ రాష్ట్రంలోని జైస‌ల్మేర్‌లోని సూర్య‌ఘ‌ర్ ప్యాల‌స్‌లో అతి కొద్ది మంది అతిథులు, కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నాను. హిందూ సంప్రదాయం ప్ర‌కారం వీరి వివాహ వేడుక అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. పెళ్లి ఫోటోల‌ను ఈ జంట సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా నెటీజ‌న్లు, సెల‌బ్రెటీలు కొత్త జంట‌కు శుభ‌కాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.


అయితే.. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న మాత్రం కియారా అడ్వాణీకి క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. పెళ్లికి రాలేక‌పోయినందుకు క్ష‌మించాల‌ని కోరింది. "కంగ్రాట్స్ కియారా. మీ జంట చూడ‌చ‌క్క‌గా ఉంది. పెళ్లికి మేము రాలేక‌పోయాం. ఇందుకు సారీ. మీఇద్ద‌రికి మ‌రోసారి అభినంద‌న‌లు "అని ఉపాస‌న కామెంట్ చేసింది.


రామ్‌చ‌ర‌ణ్ హీరో గా తెర‌కెక్కిన విన‌య విధేయ రామ చిత్రంలో కియారా అడ్వాణీ క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో చ‌ర‌ణ్, కియారా మంచి స్నేహితులు అయ్యారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ ఆర్‌సీ15 చిత్రం కోసం మ‌రోసారి క‌లిసి ప‌ని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. స్టార్ డెరెక్ట‌ర్ శంక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Next Story