Ram Charan:చ‌ర‌ణ్ పుట్టిన రోజున అభిమానుల‌కు అల్లు అర‌వింద్ స‌ర్‌ప్రైజ్‌

రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న కెరీర్‌ను ములుపు తిప్పిన చిత్రం మ‌గ‌ధీర‌ను రీ రిలీజ్ చేయ‌నున్నారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Feb 2023 2:08 PM IST
Magadheera re-release, Magadheera re-release date, Ram Charans Magadheera re-release

చ‌ర‌ణ్ పుట్టిన రోజున అభిమానుల‌కు అల్లు అర‌వింద్ స‌ర్‌ప్రైజ్‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌ను ములుపు తిప్పిన చిత్రం 'మ‌గ‌దీర‌'. ఈ చిత్రం అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డులు అన్నింటిని బ‌ద్ద‌లు కొట్టింది. 2009లో విడుద‌లైన ఈ చిత్రం ఆల్ టైం ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. దాదాపు 13 ఏళ్లు త‌రువాత మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌కంప‌నాలు సృష్టించడానికి సిద్ద‌మైంది. రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు గీతా ఆర్ట్స్ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది.

మార్చి 27 ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక లొకేష‌న్ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. మ‌రికొద్ది రోజుల్లో ఇందుకు సంబంధించిన టికెట్ల బుకింగ్ కూడా మొద‌లుకానున్న‌ట్లు చెప్పింది. దీంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా 'చిరుత' చిత్రంతో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టాడు రామ్‌చ‌ర‌ణ్‌. త‌న రెండ‌వ చిత్రం మ‌గధీర‌తో త‌న కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న కాజ‌ల్ న‌టించింది. పూర్వ జన్మల నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆక‌ట్టుకుంది.

Next Story