అమ్మానాన్న‌ల‌కు పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు తెలిపిన చ‌ర‌ణ్‌.. ట్వీట్ వైర‌ల్‌

Ram Charan wishing his parents 42nd wedding anniversary.అమ్మానాన్న‌ల‌కు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ శుభాకంక్ష‌లు తెలిపారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Feb 2021 5:47 AM GMT
అమ్మానాన్న‌ల‌కు పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు తెలిపిన చ‌ర‌ణ్‌.. ట్వీట్ వైర‌ల్‌

అమ్మానాన్న‌ల‌కు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి -సురేఖ 42వ వివాహా వార్షికోత్స‌వం సంద‌ర్భంగా చ‌ర‌ణ్ త‌న శుభాకాంక్ష‌ల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. వారిద్ద‌రి ఫోటోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన చ‌ర‌ణ్ .. 'నా అతి పెద్ద బ‌లం.. మీ ఇద్దరికీ 42 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు' అని రాయ‌డంతో పాటు ఓ హార్ట్ సింబ‌ల్‌ను కూడా జ‌త చేశాడు చ‌ర‌ణ్‌. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. అభిమానులు కూడా మెగాస్టార్ చిరంజీవి దంప‌తుల‌కు కామెంట్ల ద్వారా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.


1980వ సంవత్సరం, ఫిబ్ర‌వ‌రి 20న మ‌ద్రాసులో ఉద‌యం 10.04 నిమిషాల‌కు చిరంజీవి, సురేఖ ల పెళ్లి జ‌రిగింది. వీరికి ముగ్గురు సంతానం. సుస్మిత, శ్రీజ, రామ్ చ‌ర‌ణ్. సుష్మిత.. నాన్న, తమ్ముడి సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్‌గా పని చేసింది. శ్రీజ.. కళ్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకుని పిల్లల ఆలనా పాలనా చూస్తోంది. రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ సూప‌ర్ స్టార్ల‌లో రామ్‌చ‌ర‌ణ్ ఒక‌రు. ఇదిలా ఉంటే.. సురేఖ వ‌చ్చిన త‌ర్వాతే త‌న జీవితంలో ఎన్నో మార్పులు వ‌చ్చాయ‌ని, ఆమె వ‌చ్చిన త‌ర్వాతే త‌న కెరీర్ కూడా మారిపోయింద‌ని ఎన్నో సంద‌ర్భాల్లో చిరంజీవి చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం చిరు.. 'ఆచార్'య చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమా తరువాత 'లూసిఫర్', 'వేదాళం' సినిమాలు ఉన్నాయి. ఆ తరువాత దర్శకుడు బాబీతో కూడా ఓ సినిమా చేయనున్నారు. ఇక చరణ్ విషయానికొస్తే చరణ్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత శంకర్ డైరెక్షన్‌లో తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఆచార్య చిత్రంలో చిరంజీవితో పాటు రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.


Next Story