కేజీఎఫ్ 2 తెలుగు ట్రైలర్‌ను విడుద‌ల చేసేది ఎవ‌రంటే..?

Ram Charan to launch KGF 2 Telugu trailer.సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో కేజీఎఫ్ 2 ఒక‌టి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 March 2022 7:38 AM
కేజీఎఫ్ 2 తెలుగు ట్రైలర్‌ను విడుద‌ల చేసేది ఎవ‌రంటే..?

సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'కేజీఎఫ్ 2' ఒక‌టి. కన్నడ రాకింగ్ స్టార్ య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ దర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో య‌శ్ స‌ర‌స‌న శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 1' చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డంతో 'కేజీఎఫ్ 2' చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రం ఏప్రిల్ 14 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

ఈ క్ర‌మంలో నేడు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఈరోజు బెంగళూరులో గ్రాండ్‌గా జరగనుంది. బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్‌జోహార్ ఈ వేడుక‌కు వ్యాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. క‌న్న‌డ న‌టుడు శివ‌రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది.

సంజయ్ దత్, రావు రమేష్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.

Next Story