రేపు మెల్‌బోర్న్‌లో భారత జెండాను ఎగురవేయనున్న రామ్ చరణ్
ఆగస్ట్ 17న ఆస్ట్రేలియాలో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM)లో తెలుగు సూపర్ స్టార్ రామ్ చరణ్ భారత జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
By అంజి Published on 16 Aug 2024 12:07 PM ISTరేపు మెల్‌బోర్న్‌లో భారత జెండాను ఎగురవేయనున్న రామ్ చరణ్
ఆగస్ట్ 17న ఆస్ట్రేలియాలో జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM)లో తెలుగు సూపర్ స్టార్ రామ్ చరణ్ భారత జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమం మెల్‌బోర్న్‌లోని ఫెడరేషన్ స్క్వేర్‌లో ఉదయం 10 గంటలకు జరుగుతుంది. ఆగస్ట్ 15 నుంచి ఆగస్టు 25 మధ్య జరిగే ఫిల్మ్ ఫెస్టివల్‌లో.. రామ్‌చరణ్‌కు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్‌గా సత్కరించనున్నారు.
ఈ వేడుకకు ముందు.. రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కామినేని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మెల్బోర్న్ చేరుకున్నారు. ఆగస్టు 15న మెల్‌బోర్న్‌లో దిగిన రామ్‌చరణ్, ఉపాసనలకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో అతను ఐఎఫ్‌ఎఫ్‌ఎమ్ బృందంతో కలిసి వెళ్లాడు.
ఈరోజు ఆగస్టు 16, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ అధికారిక ఎక్స్ పేజీ ఫెడరేషన్ స్క్వేర్‌లో జరిగిన జెండా ఎగురవేత కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను కలవడానికి ప్రజలను స్వాగతించింది. ఒక పోస్టర్‌ను షేర్ చేస్తూ నిర్వాహకులు ఇలా రాశారు. "ఆగస్టు 17, ఉదయం 10 గంటలకు ఫెడరేషన్ స్క్వేర్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భారత జాతీయ జెండాను ఎగురవేయనున్న సందర్భంగా ఆయనను కలిసే గొప్ప అవకాశం ఇదిగో. ఆగష్టు 15-25 వరకు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 15వ ఎడిషన్ జరుగుతోంది"
ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్‌ను భారతీయ కళ మరియు సంస్కృతికి అంబాసిడర్‌గా సత్కరించనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, "భారతీయ సినిమా వైవిధ్యం, గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికపై జరుపుకునే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో భాగమైనందుకు నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. మన చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించడం, అభిమానులతో కనెక్ట్ అవ్వడం ఒక అదృష్టం" అని అన్నారు.
'RRR' విజయం, ప్రపంచవ్యాప్తంగా అది అందుకున్న ప్రేమ అపారమైనది. ఈ క్షణాన్ని మెల్‌బోర్న్‌లోని ప్రేక్షకులతో పంచుకోవడానికి నేను థ్రిల్‌గా ఉన్నాను. ఇక్కడ మెల్‌బోర్న్‌లో మన జాతీయ జెండాను ఎగురవేసేందుకు నేను ఈ అద్భుతమైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అని రామ్ చరణ్ అన్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ యొక్క 'గేమ్ ఛేంజర్'లో సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సనాతో కూడా ఓ సినిమా ఉంది.