రామ్‌చరణ్‌ బిరుదుని మార్చేశారుగా.. అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, డైరెక్టర్‌ బుచ్చిబాబు కాంబినేషన్‌లో భారీ పాన్‌ ఇండియా సినిమాను ప్రారంభించారు.

By Srikanth Gundamalla
Published on : 23 March 2024 9:45 AM IST

ram charan, new movie,  director buchi babu, tollywood,

రామ్‌చరణ్‌ బిరుదుని మార్చేశారుగా.. అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, డైరెక్టర్‌ బుచ్చిబాబు కాంబినేషన్‌లో భారీ పాన్‌ ఇండియా సినిమాను ప్రారంభించారు. ఈ మూవీ కోసం పూజా కార్యక్రమం కూడా ఇటీవల అట్టహాసంగా నిర్వహించారు. మెగాస్టార్‌ చిరంజీవి, డైరెక్టర్ శంకర్‌తో పాటు అల్లు అరవింద్‌లు ముఖ్యఅతిథులుగా హాజరు అయ్యారు. RC16 మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ స్టార్ నటి జాన్వీ కపూర్‌ నటిస్తుండగా.. సంగీతం ఏఆర్ రెహమాన్‌ అందిస్తున్నారు.

యాక్టింగ్‌లో రంగస్థలం సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌కు పదికి పది మార్కులు పడ్డాయి. అందులో రామ్‌చరణ్‌ ఇరగదీశాడని చెప్పారు అభిమానులు. అయితే.. బుచ్చిబాబు కూడా రంగస్థలం లాగా రస్టిక్ నేచర్‌తో ఆ చిత్రానికి పదిరెట్లు గ్రాండ్‌గా అబ్బురపరిచే సన్నివేశాలతో వైల్డ్‌గా ఆర్‌సీ16 మూవీ తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్‌ అభిమానులు డైరెక్టర్‌ శంకర్‌తో చెర్రీ తీస్తోన్న గేమ్‌ చేంజర్‌ కన్నా బుచ్చిబాబుతో వస్తోన్న మూవీ కోసం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే.. ఆర్‌సీ16 మూవీ పూజా కార్యక్రమం సందర్భంగా ఆసక్తికరణ పరిణామం జరిగింది. ఇప్పటి వరకు రామ్‌చరణ్‌కు మెగా పవర్‌ స్టార్‌ అనే బిరుదు ఉండేది. అభిమానులు ముద్దుగా అలానే పిలిచేవారు. అయితే.. దీన్ని తాజాగా తీసేసారు. కొత్త బిరుదుని పెట్టారు. ఆర్‌సీ16 మూవీ సందర్భంగా ఈ బిరుదుని అఫీషియల్‌గా ప్రకటించింది మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ. ఈ మేరకు ఎక్స్‌లో ఫొటోలు షేర్‌ చేసిన మైత్రీ మూవీస్‌.. మెగా పవర్‌ స్టార్‌కి బదులు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అని పోస్టర్‌ను విడుదల చేసింది. దీన్ని చూసిన చెర్రీ అభిమానుల కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


కాగా.. రామ్‌చరణ్‌ ఆర్ఆర్ఆర్‌ తర్వాత గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యాన్స్‌ కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేశారు. అభిమానల కోరిక మేరకు నడుచుకున్నారో లేదంటే.. రామ్‌చరణ్‌ గ్లోబల్‌ స్టార్‌ అనే ట్యాగ్‌కు అర్హుడు అని భావించారో తెలియదు కానీ చిత్ర యూనిట్‌ మాత్రం అధికారికంగా ఈ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.


Next Story