ఆచార్య సినిమా.. రామ్ చరణ్ లుక్ విడుద‌ల .. సిద్ధ ఆగయా

Ram Charan joins the Acharya Shoot.మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య‌'. కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.రామ్ చరణ్ లుక్ విడుద‌ల .

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jan 2021 11:20 AM IST
Ram Charan joins the Acharya Shoot

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య‌. కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. తాజాగా సెట్‌లోకి రామ్‌చ‌ర‌ణ్ అడుగుపెట్టాడంట‌. ఈ విష‌యాన్ని చిత్ర బృందం తెలియ‌జేసింది.

దర్శకుడు కొరటాల శివ.. మా 'సిద్ధ' సర్వం సిద్ధం... అంటూ రామ్ చరణ్ ప్రీ లుక్ రివీల్ చేస్తూ ట్వీట్ చేసాడు. ఈ ఫోటోలో రాంచరణ్ బ్యాక్ నుంచి కనిపిస్తూ.. చెవికి రింగుతో, మెడలో రుద్రాక్షతో ఆలయంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. రామ్ చరణ్ 'సిద్ధ' పాత్రలో చేయనున్నట్లుగా క్లారిటీ ఇచ్చేసారు కొరటాల. ప్రస్తుతం ఈ అప్డేట్ తో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అలాగే ముందుగా అనుకున్నట్లుగా కాకుండా సినిమాలో చ‌ర‌ణ్ పాత్ర‌ నిడివిని కూడా పెంచినట్లు సమాచారం.


దేవాలయ శాఖ కుంభకోణాలు రాజకీయాల నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్ కి గురి చేసే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తేజ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని మే 9 తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.


Next Story