ఆచార్య‌కు తోడుగా సిద్ద‌.. మెగా క్రామేడ్స్ లుక్స్ అదుర్స్

Ram charan first look from Acharya.మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 March 2021 10:19 AM IST
ఆచార్య‌కు తోడుగా సిద్ద‌.. మెగా క్రామేడ్స్ లుక్స్ అదుర్స్

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. సిద్ద అనే ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కాగా.. నేడు రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆచార్య చిత్రంలోని ఆయ‌న లుక్‌ను పోస్ట‌ర్ రూపంలో విడుద‌ల చేశారు. వారిద్ద‌రు చేతిలో తుపాకుల‌తో వ‌స్తున్న విరోచిత చిత్రం ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఇటీవ‌ల ఓ సంద‌ర్భంలో చిరంజీవి చెప్పిన‌ట్లు వారిద్ద‌రి వేష‌దార‌ణ‌లు మావోయిస్టు త‌ర‌హాలో ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇటీవ‌ల తండ్రీ త‌న‌యుల కాంబినేష‌న్‌లో కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను సింగ‌రేణి ప్రాంతంలో చిత్రీక‌రించారు.

ఈ సినిమాను దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా, ఇందులో దేవాలయం సెట్ కోసం దాదాపు రూ.10 కోట్లను ఖర్చు చేసారు. హైద‌రాబాద్ శివారులోని కోకాపేట్‌లో 20 ఎక‌రాల విస్తీర్ణంలో ఈ చిత్రం కోసం టెంపుల్ టౌన్ ఏర్పాటు చేయ‌గా, వీటికి సంబంధించిన ఫొటోల‌ను చిరంజీవి త‌న సోష‌ల్ మీడియాలో ఏర్పాటు చేశారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ప‌తాకంపై రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండ‌గా.. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ ఏడాది మే 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు.


Next Story