కేంద్ర‌హోంమంత్రి అమిత్ షాను క‌లిసిన చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్

ఆస్కార్ అవార్డు అందుకున్న సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని న‌టులు చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌లు అమిత్ షాను క‌లుసుకున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 March 2023 3:47 AM GMT
Chiranjeevi Ramcharan Meets Amit Shah, Ram Charan,

రామ్‌చ‌ర‌ణ్‌ను శాలువాతో స‌త్క‌రిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

భార‌తీయ చిత్ర‌సీమ‌లోని ఇద్ద‌రు దిగ్గ‌జాలు అయిన మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను క‌ల‌వ‌డం ఆనందంగా ఉంద‌ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని "నాటు నాటు" పాట‌కు ఆస్కార్ అవార్డు అందుకున్న సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని న‌టులు చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌లు శుక్ర‌వారం రాత్రి కేంద్ర హోంమంత్రి నివాసంలో ఆయ‌న్ను క‌లిశారు.

భార‌త‌దేశ సంస్కృతి, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ గ‌ణ‌నీయంగా ప్ర‌భావితం చేస్తుంద‌ని అమిత్‌షా కొనియాడారు. రామ్‌చ‌ర‌ణ్‌ను అమిత్ షా శాలువాతో స‌త్క‌రించారు. ఈ విష‌యాన్ని అమిత్ షా ట్వీట్ చేయ‌డంతో పాటు అందుకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేశారు. అమిత్ షా, చిరు, చ‌ర‌ణ్‌లు ఉన్న ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

చ‌ర‌ణ్‌కు అభినందన‌లు తెలిపి ఆశీస్సులు అంద‌జేసిన కేంద్ర హోంమంత్రికి, ఆర్ఆర్ఆర్ చిత్ర‌బృందానికి, రామ్‌చ‌ర‌ణ్ త‌రుపున కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు చిరంజీవి ట్వీట్ చేశారు.

Next Story
Share it