విషాదంలో ర‌కుల్ ప్రీత్ సింగ్.. 'నువ్వు ఎక్క‌డ ఉన్నా సంతోషంగా ఉండాలి'

Rakul Preet Singh mourns demise of her pet dog Blossom.టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ల‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Dec 2022 11:33 AM IST
విషాదంలో ర‌కుల్ ప్రీత్ సింగ్..  నువ్వు ఎక్క‌డ ఉన్నా సంతోషంగా ఉండాలి

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ల‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. అయితే గ‌త కొద్ది రోజులుగా తెలుగులో చిత్రాల‌ను ర‌కుల్ చేయ‌డం లేదు. బాలీవుడ్‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది. ఇదిలా ఉంటే ర‌కుల్ విషాదంలో మునిగిపోయింది. తాను ఎంతో ప్రేమ‌గా పెంచుకుంటూ వ‌చ్చిన పెట్‌డాగ్ మ‌ర‌ణించ‌డమే అందుకు కార‌ణం. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌కుల్ వెల్ల‌డించింది. అంతేకాకుండా త‌న పెట్‌డాగ్‌తో క‌లిసి దిగిన ఫోటోల‌ను షేర్ చేసింది.

"బ్లోస‌మ్‌.. నువ్వు మా జీవితాల్లోకి 16 ఏళ్ల క్రితం వ‌చ్చావు. సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకువ‌చ్చావు. నువ్వు, నేను క‌లిసే పెరిగాం. నిన్ను చాలా మిస్ అవుతున్నా. నువ్వు ఎంతో చ‌క్క‌టి జీవితాన్ని గ‌డిపావు. ఎలాంటి బాధ లేకుండా వెళ్లిపోయావు. నీ ఆత్మ‌కు శాంతి చేకూరాలి. నువ్వు ఎక్క‌డ ఉన్నా బాగుండాలి అంటూ ర‌కుల్ పోస్ట్ చేసింది.

ర‌కుల్ పోస్ట్‌పై మంచు ల‌క్ష్మీ స్పందించింది. రెస్ట్ ఇన్ పీస్ బ్లోస‌మ్‌. ర‌కుల్ నాకు తెలిసిన‌ప్ప‌టి నుంచి బ్లోస‌మ్ నాకు తెలుసు అంటూ కామెంట్ చేసింది. ప‌లువురు సెల‌బ్రెటీలు, అభిమానులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

Next Story