నా పెళ్లి గురించి నాకు కూడా చెప్పాలి గదా తమ్ముడూ..! : రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh DISMISSES her marriage reports.టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు.
By తోట వంశీ కుమార్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. అయితే.. ఇటీవల కాలంలో అమ్మడు బాలీవుడ్‌లో వరుస చిత్రాలను చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తెలుగులో ఆమె చివరగా కనిపించిన సినిమా 'కొండ పొలం'. దీంతో ఆమె తెలుగు సినిమాల్లో ఇక కనిపించదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై రకుల్ స్పందించింది.
తనను చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారని చెప్పింది. "వాస్తవానికి ఇటీవల నేను తెలుగు చిత్రాల్లో నటించడం లేదని నా క్కూడా తెలుసు. అయితే.. తప్పకుండా టాలీవుడ్‌లో నటిస్తా. తెలుగు అభిమానులను నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నాన్నంటే అందుకు తెలుగు చిత్ర పరిశ్రమే కారణం" అని రకుల్ చెప్పింది.
ఇదిలా ఉంటే.. రకుల్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. వీరిద్దరు అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని రకుల్ తమ్ముడు అమన్ ప్రీత్ చెప్పినట్లు ఓ ఆంగ్ల పత్రికలో వార్తలు వచ్చాయి. దీనిపై రకుల్ స్పందించింది. ఆంగ్ల పత్రిక వార్తను షేర్ చేసిన రకుల్.. 'అమన్.. నా పెళ్లి ఖరారు చేశావా ? నా పెళ్లి గురించి నా క్కూడా చెప్పాలి కదా తమ్ముడూ..! ఏంటో.. నా జీవితం నాకే తెలియకపోవడం ఫన్నీగా ఉంది. అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
😂 @AmanPreetOffl you confirmed ? Aur mujhe bataya bhi nahi bro .. it's funny how I don't have news about my life .. https://t.co/ZSZgNjW2BW
— Rakul Singh (@Rakulpreet) October 12, 2022