పుట్టిన రోజు నాడు ప్రియుడిని ప‌రిచ‌యం చేసిన ర‌కుల్

Rakul introduce her boyfriend.టాలీవుడ్ ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్‌సింగ్ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ర‌కుల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Oct 2021 9:35 AM GMT
పుట్టిన రోజు నాడు ప్రియుడిని ప‌రిచ‌యం చేసిన ర‌కుల్

టాలీవుడ్ ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్‌సింగ్ పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా ర‌కుల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా తాను రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది. బాలీవుడ్ న‌టుడు, నిర్మాత జాకీ బగ్నాని ప్రేమిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. ఆయ‌న చేతిని ప‌ట్టుకుని న‌డుస్తున్న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. థాంక్యూయు నా మై లవ్ ! ఈ ఏడాది నాకు దొరికిన అతి పెద్ద గిఫ్ట్‌ నువ్వు. నా జీవితానికి రంగులు జోడించినందుకు, నన్ను నిరంతరం నవ్వించినందుకు ధన్యవాదాలు. ఇలా ఇద్దరం కలిసి ఇంకా ఎన్నో మధర జ్ఞాపకాలను తయారు చేసుకుందాం అంటూ హార్ట్‌ ఎమోజీలతో తన ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌ర‌చింది. ర‌కుల్ నేటితో 31వ వ‌సంతంలోకి అడుగుపెడుతోంది.

నిజానికి ఆమెను ఆరాధించే కొంతమంది అభిమానులకు ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరికొంత మంది మాత్రం ఈ సందర్భంగా ఆమెకు విషెస్ చెబుతున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. రీసెంట్‌గా కొండ పొలం సినిమాతో ప్రేక్షకుల‌ని ప‌ల‌క‌రించిన ర‌కుల్.. బాలీవుడ్‌లో ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉంది. అజ‌య్ దేవ‌గ‌ణ్ సినిమాల‌తో పాటు ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టిస్తున్న ఒక సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది.

Next Story