రష్మికపై ప్రేమ కొంచెం కూడా తగ్గినట్లు లేదుగా..!

Rakshit shetty tweet on Rashmika Mandanna birthday.కన్నడ నటుడు రక్షిత్ శెట్టి కూడా రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2021 6:23 AM GMT
Rashmika Mandanna

ఏప్రిల్ 5 నటి రష్మిక మందాన పుట్టినరోజు. నేషనల్ క్రష్ అంటూ పిలిపించుకుంటున్న ఈ అమ్మడికి పలువురు ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కన్నడ నటుడు రక్షిత్ శెట్టి కూడా రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. 'కిరిక్ పార్టీ' అనే కన్నడ సినిమాలో రష్మిక మొదటిసారి నటించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది రష్మిక. ఆ సినిమా హీరో అయిన రక్షిత్ శెట్టిలో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు గ్రాండ్ గా..! కానీ కొన్ని కారణాల వలన రష్మిక-రక్షిత్ శెట్టిల వివాహం జరగలేదు. మరోవైపు రష్మిక టాలీవుడ్ లోనూ బిజీ అయిపోవడంతో.. ఆమె తన కెరీర్ కోసమే రక్షిత్ శెట్టిని వదిలేసింది అంటూ భారీగా ట్రోల్ చేశారు. రష్మిక పెట్టే పోస్టులకు ఎలా పడితే అలా కామెంట్లు చేయడం.. ఇలా ఎన్నో జరిగాయి.

రష్మిక పుట్టినరోజున రక్షిత్ శెట్టి తాజాగా ఓ పోస్టు పెట్టాడు. 'కిరిక్ పార్టీ' సమయంలో రష్మిక ఇచ్చిన ఆడిషన్ వీడియోని అతను తన షోషల్‌మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ఆ సినిమాలోని డైలాగ్స్ ను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అందులో రష్మిక తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ను ఇవ్వడం చూడొచ్చు.

''నీ కిరిక్ పార్టీ ఆడిషన్‌కి సంబంధించిన ఓ అందమైన అనుభవాన్ని షేర్ చేస్తున్నాను. అప్పటి నుంచి నువ్వు ఎంతో దూరం ప్రయాణించావు.. నీ కలలు సాకారం చేసుకొనేందుకు ఓ యోధురాలిగా పోరాడుతున్నావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.. హ్యాపీ బర్త్‌ డే టూయూ'' అంటూ రక్షిత్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై రష్మిక వెంటనే స్పందించింది. ''అవును ఇది నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. రక్షిత్ చాలా థ్యాంక్యూ. ఇది ఎంతో విలువైనది'' అంటూ రీట్వీట్ చేసింది. ప్రస్తుతం రష్మిక టాలీవుడ్ సినిమాలతో పాటూ, బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఉంది.


Next Story
Share it