ప్రపంచ వ్యాప్తంగా 'జైలర్' సందడే
రజనీకాంత్ సినిమా అంటే సందడి మామూలుగా ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన స్క్రీన్ మీద కనపడితే చాలు అని అనే వాళ్లు ఉన్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Aug 2023 4:45 AM GMTప్రపంచ వ్యాప్తంగా 'జైలర్' సందడే
రజనీకాంత్ సినిమా అంటే సందడి మామూలుగా ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన స్క్రీన్ మీద కనపడితే చాలు అని అనే వాళ్లు ఉన్నారు. ఆయన లేటెస్ట్ గా నటించిన సినిమా "జైలర్". పాటలు, ట్రైలర్.. ఇప్పటికే భారీ హిట్ అయ్యాయి. 72 ఏళ్ల వయసులో కూడా రజనీకాంత్ స్క్రీన్ ప్రెజన్స్ సూపర్ అని అంటున్నారు. సెర్చ్ ట్రెండ్‌ల దగ్గర నుండి రికార్డ్ బద్దలు కొట్టే బాక్స్ ఆఫీస్ బుకింగ్‌ల వరకు, రజనీకాంత్ మరో సారి తన సత్తా ఏమిటో చూపించారు.
ఇన్నేళ్లుగా మారనిది ఏదైనా ఉందంటే అది రజనీకాంత్ పై ఉన్న అభిమానమే. ఆయనకు ప్రాంతాలతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన సినిమాలంటే చాలు గ్రాండ్ రిలీజ్‌కు కేరాఫ్. ఇక ఆయన సినిమాకు ముందు డిజిటల్ ట్రెండ్స్ కూడా అద్భుతమనే చెప్పొచ్చు. GrabOn వెల్లడించిన డేటా ప్రకారం, ఆగష్టు 9న Google Trends లో సుమారు 10.30 p.m.కి 100 గరిష్ట స్కోర్‌ను తాకింది. దీన్ని బట్టి అభిమానులు జైలర్ కోసం ఎంతగా ఎదురుచూస్తూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
గ్లోబల్ ఫాసినేషన్ కు సంబంధించి సింగపూర్ లో పర్ఫెక్ట్ స్కోరు లభించింది. సింగపూర్ 100 ఖచ్చితమైన స్కోర్‌తో సెర్చ్ స్టేక్స్ కు సంబంధించి టాప్ పొజిషన్ ను గెలుచుకుంది. ఇక శ్రీలంక (96), ఖతార్ (83), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (82), బహ్రెయిన్ (78) వరకు విస్తరించింది. రజనీకాంత్ స్టార్ డమ్ ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది. భారతదేశంలో మునుపటి వారంలో సగటు విలువ 74తో ఆరవ స్థానాన్ని పొందింది.
భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భాగంలో రజనీకాంత్ సినిమా అంటే చాలు పండగ వాతావరణం ఉంటుంది. తమిళనాడు కంటే కర్ణాటకలోనే జైలర్ గురించి భారీగా సెర్చ్ చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఉన్నాయి. తమిళనాడులో ముఖ్యంగా టిక్కెట్‌లను ఆఫ్‌లైన్‌లో, థియేటర్‌లలో కొనుగోలు చేస్తున్నారు. ఆన్ లైన్ కంటే ఆఫ్ లైన్ లో థియేటర్ల వద్ద సందడి భారీగా ఉంది. నగరాల వారీగా ట్రెండ్‌లను చూస్తే పిరంచేరి 100 ఖచ్చితమైన స్కోర్‌తో అగ్రస్థానంలో నిలిచింది. తైలవరం, ఉమామహేశరపురం, కురింజిపాడి, విల్లియనూర్ లకు 88 నుంచి 95 వరకు స్కోర్లు వచ్చాయి. పళని, సిరుసేరి, కుంభకోణం, కడలూరు, తిరువళ్లూరు, ఓవర్సీస్‌లో కూడా మంచి స్కోర్‌లను సాధించాయి. 50 కంటే ఎక్కువ స్కోర్‌లు సాధించిన మొత్తం 64 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయి. రజనీకాంత్‌కు భారతదేశంలో మాత్రమే కాదు.. అంతర్జాతీయంగా కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఈ ట్రెండ్స్ ను బట్టి స్పష్టంగా తెలుస్తోంది.
సినిమాటిక్ షోడౌన్!
బాక్సాఫీసు వద్ద రజనీకాంత్ 'జైలర్', చిరంజీవి 'భోళా శంకర్' మధ్య మంచి పోటీ ఉంది. జైలర్ ఓపెనింగ్ బాక్సాఫీస్ గణాంకాలు తమిళ సినిమా చరిత్ర పుస్తకాలను తిరగరాయగలవని ప్రముఖ ఫిలిమ్ ఎగ్జిబిటర్ అక్షయ్ రాఠీ ప్రకటించారు. జైలర్ ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసే తమిళ చిత్రాలలో ఒకటిగా అవతరించే ఉందని అంటున్నారు.
BookMyShow లో ఇప్పటికే 900,000 జైలర్ టిక్కెట్లు అమ్ముడుపోయాయి. దక్షిణాది రాష్ట్రాలలో భారీగా డిమాండ్ ఉంది. కొన్ని ప్రాంతాల్లో టిక్కెట్ ధరలు రూ. 800 నుండి రూ. 1,400 వరకు ఉంటాయి. బెంగళూరు నగరంలో కూడా ఆగస్టు 10వ తేదీ ఉదయం 6 గంటల నుండి ప్రదర్శనలు ఉన్నాయి. భారీ ధరకు అమ్ముతున్నారు. బెంగళూరు జైలర్‌కి రెడ్ కార్పెట్ ట్రీట్‌మెంట్ ఇస్తోంది, నగరంలో అత్యధిక సంఖ్యలో షోలు అందుబాటులో ఉన్నాయి.
జైలర్ సినిమా కథ ముత్తువేల్ పాండియన్ చుట్టూ తిరుగుతుంది. ఓ ముఠాను అడ్డుకోవడానికి రజనీ ఎలాంటి ప్రయత్నాలు చేశారు అనేది సినిమాలో చూడాలి. ఈ చిత్రంలో రజనీకాంత్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్, రమ్య కృష్ణన్, తమన్నా భాటియా వంటి స్టార్స్ ఉన్నారు. ఇప్పటికే షోలు పడిపోయాయి.. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.