'కూలీ'గా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. టీజర్‌ ఆవిష్కరించిన లోకేష్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 171వ సినిమాకు 'కూలీ' అనే సినిమా టైటిల్‌ను ఖరారు చేశారు. ఈమేరకు సోషల్‌మీడియా వేదికగా వీడియోను విడుదల చేశారు.

By అంజి  Published on  22 April 2024 6:43 PM IST
Rajinikanth, Coolie, Lokesh Kanagaraj, Kollywood

'కూలీ'గా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. టీజర్‌ ఆవిష్కరించిన లోకేష్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 171వ సినిమాకు 'కూలీ' అనే సినిమా టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు మేకర్స్‌ ఈ చిత్రం యొక్క పవర్ ప్యాక్డ్ టీజర్‌తో పాటు చిత్రం టైటిల్‌ను విడుదల చేశారు. మాస్‌ లుక్‌లో కనిపించిన రజనీకాంత్‌ డైలాగ్‌తో అదరగొట్టారు. తనదైన శైలిలో గోల్డ్ చైన్‌తో గూండాలను కొట్టడం కనిపిస్తుంది. అతను బంగారు గడియారాలతో చేసిన బెల్ట్‌తో గూండాలను కొట్టాడు. టీజర్‌ను మోనోక్రోమ్ టోన్‌లో విడుదల చేశారు, గోల్డ్ ఎలిమెంట్స్ మాత్రమే రంగులో ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది.

'కూలీ' సినిమాలో రజనీకాంత్‌ లగ్జరీ వాచ్‌లు చోరీ చేసే దొంగలా కనిపించనున్నట్టు సమాచారం. లోకేశ్‌, రజనీకాంత్‌తో కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, శ్రుతి హాసన్‌ కీలక పాత్రల్లో నటించే అవకాశాలున్నాయనేది సినీ వర్గాల సమాచారం. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాలో రజనీకాంత్‌ను నెగిటివ్ షేడ్‌లో చూపించనున్నాడు. ఈ విషయాన్ని లోకేష్ పలు ఇంటర్వ్యూల్లో కూడా తెలిపాడు. రజనీకాంత్‌ను నెగిటివ్ షేడ్‌లో చూడటం తనకు ఇష్టమని, 'కూలీ' సినిమా అదే జోనర్‌లో ఉంటుందని పేర్కొన్నాడు. రజనీకాంత్‌ ప్రస్తుతం 'వేట్టయాన్‌'లో నటిస్తున్నారు. 'జై భీమ్‌' ఫేమ్‌ టి.జె.జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది.

Next Story