సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు..
Rajinikanth honoured with Dadasaheb Phalke Award.తాజాగా కేంద్ర ప్రభుత్వం గురువారం ఉదయం రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది
By తోట వంశీ కుమార్ Published on
1 April 2021 5:57 AM GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇక రజనీ సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమా చూసేందుకు స్టార్ హీరోలు సైతం క్యూ కడుతారు. సినిమాలతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు రజనీకాంత్ ను ఓ స్థాయిలో నిలబెట్టేశాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం గురువారం ఉదయం రజనీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు.
ఇండియన్ సినిమా రంగంలో అత్యున్నత నటుల్లో ఒకరైన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నాము. ఓ నటుడిగా, నిర్మాతగా స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అద్భుతం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాను' అంటూ మంత్రి ప్రకాశ్ జావదేకర్ వెల్లడించారు. రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తే చిత్రంలో నటిస్తున్నారు.
Next Story