ఆరు పదుల వయసులో ఇదేం బుద్ధి.. ఇంకా చచ్చిపోలేదా?

Rajini Chandy trolled for latest photoshoot in jeans.మలయాళ నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ రజిని చాందీ ప్రస్తుతం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jan 2021 9:22 AM GMT
ఆరు పదుల వయసులో ఇదేం బుద్ధి.. ఇంకా చచ్చిపోలేదా?

మలయాళ నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ రజిని చాందీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. తాజాగా ఓ ఫోటోషూట్ లో భాగంగా పాశ్చాత్య వస్త్రధారణ ధరించి తీసుకున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డ‌మే అందుకు కార‌ణం. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ప్రస్తుతం ఆమెను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. 2016లో 'ఒరు ముతస్సి గాథ'తో రజిని వెండితెరపై రంగప్రవేశం చేశారు. ఈ సినిమాలో బామ్మ పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న రజిని తరువాత మలయాళంలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

గత కొంతకాలం నుంచి వెండి తెరకు దూరమైన రజిని తాజాగా పాశ్చాత్య వస్త్రధారణలో ఫొటోషూట్‌ జరుపుకున్నారు. ఎప్పుడు సాంప్రదాయబద్దమైన చీరలను ధరించే రజిని ఒక్కసారిగా డెనిమ్స్‌, ఫ్లోరల్‌ మాక్సీలు ధరించి ఫొటోలకు ఫోజులు ఇచ్చి వాటిని ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల పై కొందరు సానుకూలంగా స్పందించి మీ పై మీకున్న ఆత్మవిశ్వాసానికి, మీ ఆలోచనా ధోరణికి హాట్సాఫ్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రజిని ఫోటోలకు మరికొంత మంది నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ ఆరుపదుల వయసులో ఇదేం బుద్ధి... ఈ విధంగా సమాజానికి ఏం తెలియజేస్తున్నారు, నువ్వింకా చచ్చిపో లేదా? అంటూ తనదైన శైలిలో స్పందించారు.అయితే నెటిజన్లు చేస్తున్న కామెంట్లపై రజిని స్పందిస్తూ ఘాటుగా స్పందిస్తూ తనని ట్రోల్ చేస్తున్న వారికి గట్టిగా సమాధానాన్ని తెలియజేశారు. ఎంతోమంది నెటిజన్లు నన్ను ఎన్నో రకాలుగా అభివర్ణించారు. నన్ను విమర్శించిన వారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని, నన్ను ఆ విధంగా చూసేటప్పటికి వారిలో అసూయ కలిగిందని భావించారు.

మరికొద్ది రోజుల్లో నాకు 70 ఏళ్ళు వస్తాయి.యవ్వనంలో ఉన్నప్పుడు కుటుంబ బాధ్యత, పిల్లల బాగోగులు చూసుకుంటూ ఎంతో మంది మహిళలు వారి వ్యక్తిగత జీవితానికి దూరం అవుతున్నారు. అలాంటి వారికి ఇలాంటి వ్యాపకాలు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తాయని అనుకుంటున్నా అంటూ ఆమె తనదైన శైలిలో స్పందించారు.
Next Story