శేఖ‌ర్‌గా రాజ‌శేఖ‌ర్‌.. ఏడుస్తున్న మేఘా ఆకాశ్‌

Rajasekhar latest movie Shekhar.'లై' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాశ్‌.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Feb 2021 6:17 AM GMT
Rajasekhar latest movie Shekhar

'లై' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాశ్‌. త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోల చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికి పెద్ద‌గా గుర్తింపు తెచ్చుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం మేఘా ఆకాశ్.. 'డియ‌ర్ మేఘా' చిత్రంలో న‌టిస్తుంది. అరుణ్ ఆదిత్‌, అర్జున్ సోమ‌యాజుల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ మరియు సోరింగ్ ఎలిఫెంట్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫ‌స్టు లుక్‌ను హీరో రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్ లో మేఘ ఆకాష్ ఉద్వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఒక కంటిలో నుంచి కన్నీరు రావడం కనిపిస్తోంది.

సీనియ‌ర్ న‌టుడు రాజ‌శేఖ‌ర్ ఎమ్ఎల్‌వీ నిర్మాణంలో తన తాజా చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి మొదట నీలకంఠ దర్శకత్వ బాధ్యతలు చేపట్టినా కొన్ని అనివార్య కారణాల.. అత‌డు ఈ చిత్రం నుంచి త‌ప్పుకున్నాడు. మ‌రో దర్శకుడి కోసం చిత్ర‌బృందం వేట ప్రారంభించింది. కాగా.. నేడు హీరో రాజ‌శేఖ‌ర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి శేఖర్ అనే పేరును ఫిక్స్ చేశారు. ఫ‌స్ట్ లుక్‌లో రాజశేఖర్ సగం ముఖం కనిపిస్తుంది. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది.Next Story