'జైలర్' ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ 'జైలర్'. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్‌ని మేకర్స్ ప్రకటించారు.
By అంజి Published on 2 Aug 2023 2:16 PM IST'జైలర్' ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ 'జైలర్'. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్‌ని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాని నెల్సన్ కుమార్ డైరెక్ట్ చేశాడు. రజనీకి ఈ సినిమా మంచి కంబ్యాక్ అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్‌లు ఇస్తూ మూవీపై భారీగా బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన కావాలయ్య సాంగ్‌తో సహా ఆడియో లాంచ్‌లో రజనీకాంత్ స్పీచ్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి.
తాజాగా మేకర్స్ సినిమాపై క్రేజీ అప్‌డేట్‌ని ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో రజనీకాంత్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించాడు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, సునీల్, ప్రియాంక అరుళ్‌మోహన్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తుంది. దీంతో ఈ సినిమాతో రజనీ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మూవీ కోసం రజనీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
The D-Day is here 😎 Get set to witness #JailerShowcase today at 6 PM 💥@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @kvijaykartik @Nirmalcuts @KiranDrk… pic.twitter.com/9BP8azO2F4
— Sun Pictures (@sunpictures) August 2, 2023