తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు జ‌క్క‌న్న కృతజ్ఞతలు

Rajamouli Thanks to Telugu State CM'S.ద‌ర్శ‌కదీరుడు రాజ‌మౌళి తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2022 1:35 PM IST
తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు జ‌క్క‌న్న కృతజ్ఞతలు

ద‌ర్శ‌కదీరుడు రాజ‌మౌళి తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ఈ రోజు(బుధ‌వారం) ట్వీట్ చేశారు. ఏపీలో సినిమా టికెట్ రేట్ల‌ను స‌వ‌రిస్తూ సోమ‌వారం ప్ర‌భుత్వం జీవో జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ క్ర‌మంలో బుధ‌వారం రాజ‌మౌళి ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

'కొత్త జీవో లో టికెట్ ధ‌ర‌లు స‌వ‌రించి తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సాయం చేసినందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ గారికి, మంత్రి పేర్ని నాని గారికి ధ‌న్య‌వాదాలు. ఈ జీవో ద్వారా సినిమా పరిశ్రమ మళ్లీ మునుపటిలా పుంజుకోవడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నానని' అంటూ తెలిపాడు రాజ‌మౌళి.

'పెద్ద చిత్రాల‌కు రోజుకు 5 షోలను అనుమతించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మాకు నిరంత‌రం మ‌ద్ద‌తు ఇచ్చిన త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ గారికి కి ధ‌న్య‌వాదాలు.' అంటూ జ‌క్క‌న్న వ‌రుస ట్వీట్ చేశారు.

ఇక ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన 'ఆర్ఆర్ఆర్ ( రౌద్రం ర‌ణం రుధిరం)' చిత్రం ఎన్నో అవాంత‌రాలు దాటుకుని ఈ నెల 25 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Next Story