కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజమౌళి డిమాండ్ ఇదే!!

మీడియా బ్యారన్, ఈటీవీ చైర్మన్ రామోజీరావు ఇటీవలే కన్నుమూశారు.

By M.S.R  Published on  28 Jun 2024 5:51 AM GMT
Rajamouli,  ramoji rao, government ,

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజమౌళి డిమాండ్ ఇదే!! 

మీడియా బ్యారన్, ఈటీవీ చైర్మన్ రామోజీరావు ఇటీవలే కన్నుమూశారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో ఆయన సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కీలక సూచన చేశారు. ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డుకు రామోజీరావు పేరు ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని రాజమౌళి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను అభ్యర్థించారు.

రాజమౌళి తన కెరీర్ ప్రారంభంలో కొన్ని ETV సీరియల్స్‌లో పనిచేశారు. అంతకంటే ముందు నుండే రామోజీ రావుతో అనుబంధం ఉంది. హైదరాబాద్‌లోని ప్రముఖ రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి షూటింగ్ చాలా నెలలు చేయాల్సి వచ్చింది. ఆ సినిమాకు రామోజీరావు అందించిన సహకారాన్ని ఎన్నటికీ మరువలేరు రాజమౌళి. ఇప్పటి వరకు ఒక్క తెలుగు వ్యక్తికి మాత్రమే భారత రత్న అవార్డు లభించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఇటీవల భారతరత్న అవార్డు లభించింది. ఇప్పటి వరకు ఏ మీడియా హెడ్‌ని కూడా అవార్డుకు ప్రతిపాదించలేదు. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌కి కూడా భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కొన్నేళ్లుగా కొనసాగుతోంది. రామోజీ రావు విషయంలో రాజమౌళి చేసిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Next Story