టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి చాలా సందర్భాల్లో మహాభారతం సినిమాను భారీ ఎత్తున తీర్చిదిద్దాలనే బలమైన కోరికను వ్యక్తం చేశాడు. అలా జరగాలంటే తనకు చాలా అనుభవం అవసరమని కూడా చెప్పాడు. మహాభారతం ఆధారంగా అనేక చిత్రాలు వచ్చినా అవి ఆకట్టుకోలేదు. రాజమౌళి తన RRR: బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీలో మహాభారతానికి దర్శకత్వం వహించడం గురించి ప్రస్తావించారు. RRR గ్లోబల్ సక్సెస్.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతానికి దర్శకత్వం వహించేలా చేస్తుందని రాజమౌళి చెప్పాడు.
రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కనున్న SSMB29 కోసం లొకేషన్‌లను అన్వేషించడంలో బిజీగా ఉన్నాడు. ఇది యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయనున్నారు.
RRR డాక్యుమెంటరీ RRR: బిహైండ్ అండ్ బియాండ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. ఈ డాక్యుమెంటరీ చిత్రం కోసం మొత్తం బృందం పడిన శ్రమ, అంకితభావాన్ని చూపించారు. ఇక విజయేంద్ర ప్రసాద్ RRR సినిమా సీక్వెల్ కోసం లీడ్‌ను వదిలివేయడం గురించి ఆసక్తికరంగామాట్లాడడంతో.. RRR సీక్వెల్ కు మరోసారి ఊహాగానాలకు దారితీసింది.