ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ.. 'నాటు నాటు' కు అనిల్ రావిపూడితో క‌లిసి రాజమౌళి స్టెప్పులు

Rajamouli And Anil Ravipudi dance for RRR Natu Natu song.ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2022 11:51 AM IST
ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ.. నాటు నాటు కు అనిల్ రావిపూడితో క‌లిసి రాజమౌళి స్టెప్పులు

ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)'. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ లు క‌లిసి న‌టించిన ఈ చిత్రం మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విడుద‌లై రెండు వారాలు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ త‌గ్గ‌లేదు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ల నటనకి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది.

ఈ చిత్ర‌ నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారు. నైజాంలో ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టడంతో 'ఆర్ఆర్ఆర్' టీమ్ కు ఆయన సక్సెస్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కొరటాల శివ, అనిల్ రావిపూడితో పాటు పలువురు దర్శకనిర్మాతలు, నటీనటులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితో క‌లిసి రాజ‌మౌళి స్టెప్పులేశాడు.

కాగా.. 'ఆర్ఆర్ఆర్' చిత్ర విడుద‌లకు ముందు నిర్వ‌హించిన ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో చిత్ర బృందాన్ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఇంట‌ర్వ్యూ చేశాడు. అప్పుడు అనిల్ మాట్లాడుతూ స‌క్సెస్ పార్టీలో త‌న‌తో క‌లిసి 'నాటు నాటు' పాట‌కు స్టెప్స్ వేయాల‌ని రాజ‌మౌళిని అడుగ‌గా.. అందుకు జ‌క్క‌న్న స‌రేన‌ని అన్నాడు. ఇచ్చిన మాట ప్ర‌కారం స‌క్సెస్ పార్టీలో అనిల్‌తో క‌లిసి జ‌క్క‌న్న‌ 'నాటు నాటు' పాట‌కు డ్యాన్స్ చేశాడు. వీరిద్ద‌రు డ్యాన్స్ చేస్తుండ‌గా.. ప‌క్క‌నే ఉన్న దిల్‌రాజ్‌, చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌ల‌తో పాటు మిగిలిన వాళ్లు ఈల‌లు వేస్తూ చ‌ప్ప‌ట్లు కొడుతూ వారిని ఎంక‌రేజ్ చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story