ఆకట్టుకుంటున్న 'రాజా విక్రమార్క' టీజర్
Raja Vikramarka Teaser Out.ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తీకేయ నటిస్తున్న తాజా చిత్రం రాజా విక్రమార్క. శ్రీ సారిపల్లి
By తోట వంశీ కుమార్ Published on 4 Sep 2021 6:46 AM GMTNext Story
'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తీకేయ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా విక్రమార్క'. శ్రీ సారిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కార్తీకేయ ఎన్ఐఏ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. తాజాగా హీరో వరుణ్ తేజ్ చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. హై ఇంటెన్స్ యాక్షన్ తో ఈ చిత్రం తెరకెక్కినట్లు కనిపిస్తోంది. వాడిని ఆపడం ఎవరి తరం అంటూ విక్రమ్ పాత్ర గురించి తణికెళ్ల భరణి చెప్పె డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి.
టీజర్ చివరిలో.. చిన్నప్పుడు కృష్ణ గారిని పెద్దయ్యాక టామ్ క్రూజ్ ని చూసి ఆవేశపడి జాబ్ లో జాయిన్ అయిపోయా కానీ.. సరదా తీరిపోతోంది. ఇంక నావల్ల కాదు అని కార్తికేయ చెప్పే డైలాగ్ ఈలలు వేయించేలా ఉంది. కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ నటిస్తోంది. సాయి కుమార్, హర్ష వర్ధన్ కీలక పాత్రల్లో నటించారు. టి.ఆదిరెడ్డి సమర్పణలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతాన్ని అందిస్తున్నాడు.