ఆకట్టుకుంటున్న 'స్టాండ్ అప్ రాహుల్' ట్రైలర్
Raj Tarun's Stand Up Rahul Trailer out.యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండ్ అప్ రాహుల్’.
By తోట వంశీ కుమార్ Published on
4 March 2022 12:25 PM GMT

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం 'స్టాండ్ అప్ రాహుల్'. శాంటో మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఫేం వర్ష బొల్లమ్మ నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడులైన ఫస్ట్ లుక్, టీజర్‌లు సినిమాపై అంచనాలను పెంచేయగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
'మా బాస్ ఏ పనైనా రెండే నిమిషాల్లో చేస్తాడట 'అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. 'వీడి వెటకారంతో సంవత్సరంలో మూడు ఉద్యోగాలు వెలగబెట్టాడు'. 'జనాల్నీ నవ్వించడం ఇట్స్ ఎన్ ఆర్ట్..ఏడ్పించేవాళ్లకి అదేం అర్థమవుతుంది.' 'లైఫ్‌లో సెటిల్ అవడం నీ బ్లడ్‌లోనే లేదు' వంటి డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. నంద కుమార్ అబ్బినేని భరత్ మాగులూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ శర్మ, వెన్నల కిశోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అగస్తి సంగీతాన్ని అందిస్తున్నారు.
Next Story