'ఒసేయ్.. నీ అంతు చూస్తా.. నువ్వు ఎక్కడ ఉన్నా పట్టుకుంటా': రాజ్ తరుణ్
Raj Tarun's emotional video byte goes viral.వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్.
By తోట వంశీ కుమార్ Published on 30 Oct 2022 12:48 PM ISTజయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. 'స్టాండప్ రాహుల్' చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. తాజాగా ఇన్‌స్టాలో ఓవీడియో పోస్ట్ చేశాడు. అందులో ఓ అమ్మాయి కారణంగా అతడు బాధపడినట్లు చెప్పాడు. ప్రస్తుతం ఆ అమ్మాయిని వెతికే పనిలో ఉన్నాడట. 'ఆనందాలు, అమ్మాయిలు నా జీవితానికి హానికరం. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి' అని క్యాప్షన్‌ని జత చేసి వీడియో ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"హాయ్ అండి. నేను సడెన్‌గా ఈ వీడియో పెట్టడానికి ఓ కారణం ఉంది. మీకొక అమ్మాయి గురించి చెప్పాలి. నా జీవితంలో అమ్మాయి గురించి మాట్లాడే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నా జీవితానికి ప్రేమ సెట్ కాదని ఎప్పుడో అర్థమైంది. నాకు పెళ్లి చేయమని అమ్మానాన్నని అడిగా. దాంతో నాకు మంచి సంబంధం చూశారు. పెళ్లి రోజు రానే వచ్చింది. తీరా చూస్తే అమ్మాయి జంప్. చుట్టాలందరూ సానుభూతి మొదలెట్టారు.
ఒసేయ్.. నువ్వు ఎక్కడ ఉన్నా పట్టుకుంటా..? నీ అంతు చూస్తా..? రేపే నీ ఫోటో ఆన్లైన్‌లో పెడుతా. ఆమె కనబడితే దయచేసి నాకు చెప్పండి" అంటూ ఈ వీడియో రాజ్ తరుణ్ అన్నాడు.
అయితే.. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కొత్త సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే ఇదంతా చేశాడని అంటున్నారు. మరీ అసలు నిజం ఏంటి అనేది రాజ్ తరుణే చెప్పాలి.