'అనుభవించు రాజా' ట్రైలర్.. నవ్వులే న‌వ్వులు

Raj Tarun Anubhavinchu Raja Trailer out.యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ న‌టిస్తున్న తాజా చిత్రం అనుభ‌వించు రాజా. శ్రీను గ‌విరెడ్డి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Nov 2021 7:05 AM GMT
అనుభవించు రాజా ట్రైలర్.. నవ్వులే న‌వ్వులు

యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ న‌టిస్తున్న తాజా చిత్రం 'అనుభ‌వించు రాజా'. శ్రీను గ‌విరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈచిత్రంలో త‌రుణ్ స‌ర‌స‌న కాషిక్ ఖాన్ న‌టిస్తోంది. గ్రామీణ కథాంశం నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోపి సుంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

అందులో భాగంగానే నేడు ఈ చిత్ర ట్రైల‌ర్‌ను అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుద‌ల చేశారు. 'రూపాయి పాపాయి లాంటిదిరా.. దాన్ని పెంచి పెద్ద‌ది చేసుకోవాలిగానీ, ఎవ‌డి చేతుల్లో ప‌డితే వాడి చేతుల్లో పెట్ట‌కూడ‌దు' అనే డైలాగ్ తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. చిన్న‌ప్ప‌టి నుంచీ జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డిన కుర్రాడిగా రాజ్‌త‌రుణ్ క‌నిపించాడు. 'బంగారం గాడి మ‌న‌సు సినిమా హాలు లాంటిది. వారానికి ఒక సినిమా వ‌స్తుంటుంది. పోతుంట‌ది. ఏదీ ప‌ర్మినెంట్‌గా ఆడ‌దు ఇక్క‌డ' అంటూ రాజ్‌త‌రుణ్ చెప్పే డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ట్రైలర్‌లో రాజ్‌త‌రుణ్ త‌న‌దైన కామెడీ మార్క్‌తో అల‌రించాడు.

Next Story
Share it