అషూను ఎత్తుకున్న రాహుల్.. ఫోటో వైరల్..!

Rahul Sipligunj lifts Ashu Reddy.ర్యాప్ సాంగ్స్ పాడుతూ అభిమానుల‌ను అల‌రించిన‌ రాహుల్ సిప్లిగంజ్‌.. అషూను ఎత్తుకున్న రాహుల్.. ఫోటో వైరల్..బిగ్ బాస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jan 2021 9:16 AM IST
Rahul Sipligunj lifts Ashu Reddy

ర్యాప్ సాంగ్స్ పాడుతూ అభిమానుల‌ను అల‌రించిన‌ రాహుల్ సిప్లిగంజ్‌.. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న‌ త‌రువాత అత‌ని క్రేజ్ ఒక్క‌సారిగా మారిపోయింది. బిగ్ బాస్ విజేతగా నిలిచిన రాహుల్ కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే రంగమార్తాండ అనే చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా కొట్టేసాడు. ఈ విధంగా ఫేమస్ అయిన రాహుల్ ఇప్పుడు బిజినెస్ కూడా ప్రారంభించాడు."ఊకో కాకా"అనే తెలంగాణ యాస పేరుతో ఒక బట్టల వ్యాపారాన్ని స్థాపించాడు.

కరీంనగర్ లో ఒక షాపును ప్రారంభించగా ఆ షాప్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇంకాస్త ముందుకెళ్లి హైదరాబాద్ లో కూడా ఒక బట్టల షాపు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే నేడు హైదరాబాద్ లో కూడా ఒక షోరూం ప్రారంభించబోతున్నారని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అషూ రెడ్డి కూడా వస్తున్నట్టు రాహుల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.


బలహీనతలు తెలిసిన కూడా బలాన్ని మెచ్చుకునే వారే నిజమైన స్నేహితులు...."ఊకో కాకా" స్టోర్ ను ప్రారంభించడానికి వస్తున్న ముఖ్య అతిథి అషూ రెడ్డికి స్వాగతం అంటూ తనని ఎత్తుకొన్న ఒక ఫోటోను జత చేశాడు. దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య స్నేహం మాత్రమే కాకుండా ఇంకా ఏదో ఉందని పబ్లిక్ గా నే చెప్పేస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఫ్రెండ్ ని హత్తుకోవడం కూడా తప్పేనా అంటూ వారికి వత్తాసు పలుకుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Next Story