'రాధేశ్యామ్' మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్
Radheshyam teaser released on October 23rd.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. రొమాంటిక్ డ్రామాగా
By తోట వంశీ కుమార్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే నటిస్తోంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది చిత్రబృందం. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 23న ఉదయం 11.16 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు ఓ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించింది.
ఈ పోస్టర్ లో ప్రభాస్ ఏదో ఆలోచిస్తూ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ క్లోజప్ లుక్ చూస్తుంటే.. ఏదో ఆందోళనగా ఉన్నట్టే కనిపిస్తోంది. 'విక్రమాదిత్య ఎవరు? అక్టోబర్ 23 న 'రాధేశ్యామ్' టీజర్ గురించి తెలుసుకోవడానికి వేచి ఉండండి. టీజర్‌ను ఇంగ్లీష్ తో పాటు బహు భాషల్లో ఉపశీర్షికలతో ఆస్వాదించండి' అని ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. #GlobalPrabhasDay అనే వైరల్ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.
Who is Vikramaditya? 🤔
— Prabhas (@PrabhasRaju) October 20, 2021
Stay tuned to find out in the #RadheShyam teaser, out on 23rd October! ☺️💕 Enjoy the teaser in English with subtitles in multiple languages! #GlobalPrabhasDay#Prabhas @hegdepooja @UV_Creations @GopiKrishnaMvs @TSeries @director_radhaa pic.twitter.com/KrX1GeNu7a
గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టి-సిరీస్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మింస్తుండగా.. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.