ఆక‌ట్టుకుంటున్న 'రాధేశ్యామ్' టీజ‌ర్‌

Radheshyam teaser released.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వ‌చ్చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Oct 2021 11:38 AM IST
ఆక‌ట్టుకుంటున్న రాధేశ్యామ్ టీజ‌ర్‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వ‌చ్చేసింది. ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా 'రాధేశ్యామ్' టీజ‌ర్‌ను చిత్ర విడుద‌ల చేసింది. వింటేజ్ ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజాహెగ్డే న‌టిస్తోంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెర‌కెక్కింది. చాలా కాలంగా త‌రువాత ప్ర‌భాస్ ల‌వ‌ర్ బాయ్‌గా క‌నిపించాడు.

ప్ర‌భాస్ డైలాగ్‌లు, న‌ట‌న చాలా అద్భుతంగా ఉంది. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌ణ్ సంగీతం మ‌న‌సును హ‌త్తుకునేలా ఉంది. ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టి-సిరీస్ బ్యానర్‌ లు సంయుక్తంగా నిర్మింస్తుండ‌గా.. సంక్రాంతి కానుక‌గా 2022 జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ చిత్రం.


Next Story