ప్రభాస్ అభిమానుల‌కు షాక్‌.. 'రాధేశ్యామ్' వాయిదా...అధికారికంగా ప్రకటించిన యూనిట్

Radheshyam movie release postponed.అంతా అనుకున్న‌ట్లే జ‌రిగింది. 'ఆర్ఆర్ఆర్( రౌద్రం, రణం, రుధిరం) బాట‌లోనే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jan 2022 11:37 AM IST
ప్రభాస్ అభిమానుల‌కు షాక్‌.. రాధేశ్యామ్ వాయిదా...అధికారికంగా ప్రకటించిన యూనిట్

అంతా అనుకున్న‌ట్లే జ‌రిగింది. 'ఆర్ఆర్ఆర్( రౌద్రం, రణం, రుధిరం)' బాట‌లోనే 'రాధేశ్యామ్' చిత్రం న‌డిచింది. జ‌న‌వ‌రి 14న‌ ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తుండ‌గా.. క‌రోనా కార‌ణంగా మ‌రికొంత కాలం ఎదురుచూపులు త‌ప్ప‌డం లేదు.

క‌రోనా కొత్త వేరియంట్ కార‌ణంగా ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా రోజువారి కేసులు పెరుగుతుండ‌డంతో ప‌లు రాష్ట్రాల్లో ఆంక్ష‌లు అమ‌ల్లోకి రావ‌డంతో సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఒక్కో పెద్ద చిత్రం ప‌క్క‌కు త‌ప్పుకుంటోంది. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత అజిత్ 'వాలిమై' విడుదల కూడా వాయిదా పడింది. తమిళనాడు, బీహార్, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీ రాష్ట్రాలు థియేటర్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలోని థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్ర‌మే అనుమ‌తి ఇవ్వ‌డంతో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన 'ఆర్ఆర్ఆర్',' రాధేశ్యామ్' వంటి చిత్రాలు వాయిదా ప‌డ‌క త‌ప్ప‌డం లేదు.

Next Story