రాధేశ్యామ్ ట్రైలర్.. 'ప్రేమకు, విధికి జరిగే యుద్ధమే'

Radhe Shyam trailer release.పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2022 9:58 AM GMT
రాధేశ్యామ్ ట్రైలర్.. ప్రేమకు, విధికి జరిగే యుద్ధమే

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్‌ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోంది. గోపికృష్ణ మూవీస్‌, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ బాష‌ల్లో మార్చి 11న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడులైన‌ పాట‌లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఈ చిత్రంపై అంచ‌నాల‌ను పెంచేశాయి.

వాటిని మ‌రింత పెంచేలా చిత్ర బృందం నేడు మ‌రో ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ ట్రైల‌ర్ ఆకట్టుకుంటోంది.చివర్లో 'ప్రేమకు, విధికి జరిగే యుద్ధమే' అంటూ రాజమౌళి వాయిస్ ఓవర్‌లో వచ్చే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ప్ర‌స్తుతం ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 70ల కాలం నాటి ప్రేమ క‌థ‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో విక్ర‌మాదిత్య అనే హ‌స్త‌సాముద్రికా నిపుణుడిగా ప్ర‌భాస్ క‌నిపించ‌నున్నాడు. కృష్ణంరాజు, భాగ్య‌శ్రీ, స‌చిన్ ఖేడ్‌క‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
Next Story
Share it