ప్ర‌భాస్ 'రాధే శ్యామ్' టీజ‌ర్ వ‌చ్చేసింది.. రిలీజ్ డేట్ కూడా..

Radhe Shyam Telugu Glimpse out now.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న రోజు, 'రాధే శ్యామ్' టీజ‌ర్ వ‌చ్చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Feb 2021 9:59 AM IST
Radhe Shyam Telugu Glimpse out now

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చేసింది. ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జోడిగా న‌టిస్తున్న చిత్రం 'రాధే శ్యామ్‌'. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గోపికృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర టీజ‌ర్ కోసం ప్ర‌భాస్ అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురుచూస్తుండ‌గా.. ప్రేమికుల రోజుకు స‌రైన అర్థం చెబుతూ 'రాధే శ్యామ్' టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం.

'నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా..!? అని పూజా హెగ్డే అన‌గా.. ఛాహ్.. వాడు ప్రేమకోసం చచ్చాడు.. నేను ఆ టైప్ కాదు' అంటూ ప్ర‌భాస్ చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని జులై 30న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనుంది. పాన్ ఇండియాగా రూపొందుతున్న ఈ చిత్రానికి ద‌క్షిణాదిలో జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ స్వ‌రాలు అందిస్తుండ‌గా.. హిందీలో మిథున్, మ‌న‌న్ భ‌ర‌ద్వాజ్ ద్వ‌యం సంగీతాన్ని అందిస్తున్నారు. భాగ‌శ్రీ, ప్రియ‌ద‌ర్శి, ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్ చాలా కాలం త‌రువాత ల‌వ‌ర్‌బాయ్‌గా క‌నిపించ‌నుండ‌డంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‌


Next Story