డార్లింగ్ ల‌వ్‌స్టోరికి.. ముహూర్తం ఫిక్స్‌

Radhe Shyam teaser time fixed.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తున్న చిత్రం రాధే శ్యామ్ టీజ‌ర్‌ను ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ఇటీవ‌లే ప్ర‌క‌టించింది.‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Feb 2021 10:53 AM IST
Radhe Shyam teaser time fixed

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'రాధే శ్యామ్‌'. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్క‌తున్న ఈ చిత్రానికి జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్ర అప్‌డేట్ కోసం ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎంతో అతృత‌గా ఎదురుచూస్తున్నారు. ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న 'రాధేశ్యామ్' టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలోనే టీజ‌ర్‌కు సంబంధించిన ఓ స్పెష‌ల్ అప్‌డేట్ ను శుక్ర‌వారం అభిమానుల‌తో పంచుకుంది. ఆదివారం ఉద‌యం 9.18 గంట‌ల‌కు రాధేశ్యామ్ టీజ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


1980 దశకంలో యూరప్‌ నేపథ్యంలో నడిచే అందమైన ప్రేమకథా చిత్రంగా ఈ మూవీని తెర‌కెక్కించారు. ప్రేమికుడిగా ప్రభాస్‌ను వినూత్న పంథాలో ఆవిష్కరిస్తుంది. విక్ర‌మాదిత్య పాత్ర‌లో ఆయ‌న సంద‌డి చేయ‌నున్నాడు. పూజా .. ప్రేర‌ణ అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంది. పునర్జన్మల నేపథ్యంలో ఈ మూవీ కథ మునుపెన్నడూ చూడ‌ని విధంగా ఉంటుంద‌ని తెలుస్తుంది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Next Story