అఫిషియల్ : రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Radhe Shyam release on March 11th 2022.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రం 'రాధేశ్యామ్‌'. రాధా కృష్ణ కుమార్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Feb 2022 10:17 AM IST
అఫిషియల్ : రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన చిత్రం 'రాధేశ్యామ్‌'. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉండ‌గా.. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వాయిదా ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రం ఓటీటీ వేదిక‌గా విడుద‌ల కానుంద‌నే వార్త‌లు షికారు చేశాయి. తాజాగా ఆ వార్త‌ల‌కు చిత్ర బృందం పుల్‌స్టాప్ పెట్టింది. థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో పాటు కొత్త విడుద‌ల తేదీని కూడా చెప్పేసింది.

మార్చి 11న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చెబుతూ ఓ కొత్త పోస్ట‌ర్‌ను చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్ విడుద‌ల చేసింది. చిత్ర‌బృందం ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌భాస్ అభిమానులు ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటలీ నేపథ్యంలో పీరియాడిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోంది. కృష్ణంరాజు కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ ఓ జ్యోతిష్య నిపుణుడిగా విక్ర‌మాదిత్య పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. పూజా ప్రేర‌ణ‌గా అల‌రించ‌నుంది. ప్రేమ‌ను గెలిపించుకోవ‌డానికి వీరిద్ద‌రూ ఏం పోరాటం చేశారు అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేంత వ‌ర‌కు ఆగాల్సిందే.


Next Story