'రాధే శ్యామ్'.. సర్‌ప్రైజింగ్ పోస్టర్ విడుద‌ల

Radhe Shyam new poster released.సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో రాధేశ్యామ్ ఒక‌టి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2021 11:47 AM IST
రాధే శ్యామ్.. సర్‌ప్రైజింగ్ పోస్టర్ విడుద‌ల

సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రాల్లో రాధేశ్యామ్ ఒక‌టి. పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ ల‌వ‌ర్ బాయ్ పాత్ర‌లో న‌టించ‌డంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోంది. నేడు శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మిని పుర‌స్క‌రించుకుని చిత్ర బృందం అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది. ఈ సినిమా నుంచి స‌రికొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

ఈ పోస్ట‌ర్‌లో ప్ర‌భాస్‌.. పూజా హెగ్డేకు పియోనో నేర్పిస్తున్నాడు. ఈ పోస్ట‌ర్ చాలా అందంగా ఉండ‌డంతో పాటు ప్ర‌తి ఒక్క‌రిని ఆకట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ చిత్రంలో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య అనే పాత్ర‌ను పోషిస్తుండ‌గా.. పూజాహెగ్డే ప్రేర‌ణ పాత్ర‌లో న‌టిస్తోంది. యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం తెర‌కెక్కింది. కాగా.. లాక్ డౌన్, షూటింగ్స్ వాయిదా పడటంతో చిత్ర యూనిట్ ముందుగా చెప్పిన రిలీజ్ డేట్ జులై 30కి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయింది. సంక్రాంతి సంద‌ర్భంగా 2022 జ‌న‌వ‌రి 14న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story