'రాధే శ్యామ్' నుంచి సర్‌ప్రైజింగ్ పోస్టర్.. మంచులో ప్రభాస్-పూజా హెగ్డే
Radhe Shyam Maha Shivratri poster released.'రాధే శ్యామ్' యూనిట్ ఓ ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేసింది.
By తోట వంశీ కుమార్ Published on 11 March 2021 9:41 AM ISTయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధే శ్యామ్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రానికి జిల్ ఫేం రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల రిలీజ్ డేట్‌ను ప్రకటించడంతో పాటు ఈ చిత్రం నుంచి గ్లిమ్స్ వీడియోను కూడా విడుదల చేశారు. మార్చి 11న మహా శివరాత్రి పర్వదినం. దీన్ని పురస్కరించుకుని 'రాధే శ్యామ్' యూనిట్ ఓ ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేసింది.
Some call it madness, we call it love. This love story will forever be etched in your hearts! 💕
— Radhe Shyam (@RadheShyamFilm) March 11, 2021
Team #RadheShyam wishes you all a very Happy #MahaShivratri! ✨#30JulWithRS
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/DPOXDez006
ఈ పోస్టర్‌లో ప్రభాస్, పూజా హెగ్డే మంచులో వ్యతిరేక దిశల్లో పడుకుని కనిపిస్తున్నారు. ఇద్దరూ ఆకాశం వైపు చూస్తున్న ఈ రొమాంటిక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. దీన్ని కూడా ఐదు రకాల భాషలతో విడుదల చేశారు. ఈ ఫొటోలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సడెన్ సర్‌ఫ్రైజ్‌కు అభిమానులు పుల్ ఖుషి అవుతున్నారు. కథానాయిక పూజా హెగ్డే సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కొందరు దీన్ని పిచ్చి అంటారు.. కానీ మేం ప్రేమగా పిలుచుకుంటాం అని కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. చాలా కాలం తరువాత ప్రభాస్ లవ్‌స్టోరీలో నటిస్తుండడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.