ఆకట్టుకుంటున్న రాధేశ్యామ్ 'ఈ రాతలే' వీడియో సాంగ్
Radhe Shyam EE Raathale song out now.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ
By తోట వంశీ కుమార్ Published on
25 Feb 2022 8:18 AM GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. ఎన్నో అవాంతరాలు దాటుకుని మార్చి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌లు, టీజర్‌లు అభిమానులను అలరించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి 'ఈ రాతలే' అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కృష్ణకాంత్ రచించిన ఈ పాటను యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి పాడారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించాడు. ఈ పాటలో ప్రభాస్, పూజా హెగ్డేల లుక్స్, లొకేషన్లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరినీ ఈ పాట ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారి వినేయండి.
Next Story