ఆహా..రాధే శ్యామ్ కి బాలీవుడ్ లో క్రేజ్ మాములుగా లేదుగా..
Radhe Shyam Craze In Bollywood. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం "రాధే శ్యామ్ " సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
By Medi Samrat Published on 10 Feb 2021 4:47 PM IST
ఇక ఈ సినిమా సాహో తరువాత చాలా గ్యాప్ తో రావడం అలాగే పక్కా లవ్ బేస్డ్ మూవీ అవ్వడం, ఇందులో పూజాహెగ్డే, ఇంకా అలనాటి అందాల తారా భాగ్యశ్రీలు నటిస్తుండడం అనేది బాలీవుడ్ మార్కెట్ లో కూడా మంచి ఊపు తెస్తోంది. ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ రేటు పలికే ఛాన్స్ ఉంది. ఇక దీనిని మించి బాలీవుడ్ లో రేటు పలుకుతుందని, ఖాన్ హీరోల సినిమాలు ఇలాగే లవ్ స్టోరీలు సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాయి కాబట్టీ ఈసారి ప్రభాస్ మార్కెట్ ని గట్టిగానే కొడతాడని అంటున్నారు.ఇక ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో లవర్ బాయ్ హీరోగా అవ్వడం ఖాయమని అంటున్నారు చిత్రబృందం వారు...
చివరిసారిగా సాహో సినిమాతో బాలీవుడ్ లో భారీ వసూళ్లు రాబట్టిన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ తో బాలీవుడ్ కలెక్షన్ కింగ్ గా మారబోతున్నాడని టాక్. ఎంత రేటైనా సరే కొనేందుకు బాలీవుడ్ లో పోటీపడుతున్నారట. సినిమా ఎప్పుడు రిలీజ్ అన్నది టీజర్ లో చెప్తే గనక ఈ మార్కెట్ ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.