సల్మాన్ దెబ్బ.. సర్వర్లు డౌన్
Radhe makes ZEE5 servers crash.బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి
By తోట వంశీ కుమార్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నటించిన సినిమాల కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఇక తాజాగా ఆయన నటించిన చిత్రం రాధే. ఈద్ సందర్భంగా ఈ రోజు ఓటీటీ జీ5లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నలభైకి పైగా దేశాలలో విడుదల అయ్యింది. అలాగే పలు విదేశీ మార్కెట్లలో రాధే మూవీ థియేట్రికల్ రిలీజ్ కూడా అయ్యింది.
ఓటిటి ప్లాట్ ఫామ్ జీ5లో చూసే వారు చందా చెల్లించాల్సి ఉంటుంది. 'పే పర్ వ్యూ' రాధే సినిమాకు 249/- ప్రైస్ సెట్ చేశారు మేకర్స్. ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా 2గంటల 33నిముషాల వ్యవధి కలిగి ఉందట. కాగా.. మధ్యాహ్నం 12 గంటలకు జీ 5లో డైరెక్ట్ స్ట్రీమింగ్ చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా వినియోగదారులు సినిమా కోసం లాగిన్ కావడంతో ఓటీటీ వేదిక జీ5, జీప్లెక్స్ సర్వర్లు స్తంభించిపోయాయట. మొత్తం 1 మిలియన్ మందికి పైగానే సినిమా చూసేందుకు రావడంతో ఇలా జరిగిందని అంటున్నారు. అయితే.. సర్వర్లు ఆగిపోవడానికి గత కారణాలను మాత్రం సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు.
Thank you for the unprecedented love, will be back soon pic.twitter.com/jSB1w70qBj
— ZEE5 (@ZEE5India) May 13, 2021
మీ ప్రేమకు ధన్యవాదాలు. సమస్యను పరిష్కరిస్తున్నాం. త్వరలోనే మీ ముందుకు వస్తాం. అని ట్వీట్ మాత్రమే చేసింది. దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన సీటీమార్ సాంగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావడమే కాక సినిమాపై అంచనాలు పెంచింది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిశా పటానీ కథానాయికగా నటించింది.