వ‌ర్మ‌కు షాకిచ్చిన పీవీఆర్, ఐనాక్స్‌

PVR and INOX cinemas rejects to screen Varma Dangerous.నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2022 4:10 AM GMT
వ‌ర్మ‌కు షాకిచ్చిన పీవీఆర్, ఐనాక్స్‌

నిత్యం వివాదాల‌తో సావాసం చేసే ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. తాజాగా ఆయ‌న తెర‌కెక్కించిన చిత్రం 'డేంజ‌ర‌స్‌'. తెలుగులో మా ఇష్టం పేరుతో విడుద‌ల‌వుతోంది. అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో న‌టించిన ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇద్ద‌రు మ‌హిళ‌ల మ‌ధ్య సాగే ప్రేమ క‌థ ఈ చిత్రం అని ఇప్ప‌టికే వ‌ర్మ అనేక సార్లు చెప్పాడు, లెస్బియ‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ మల్టీప్లెక్సులైన పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్‌లు గ‌ట్టి షాకిచ్చాయి.

త‌మ థియేట‌ర్ల‌లో ఈ చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌కు నిరాక‌రించాయి. ఈ విషయాన్ని రామ్‌గోపాల్ వ‌ర్మ‌నే స్వయంగా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించాడు. తన సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఉన్న విషయాన్ని ప్రస్తావించాడు. ఈ రెండు సంస్థలు తమ నిర్ణయంతో స్వలింగ సంపర్కులను అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

"@_PVRcinemas, @INOXCINEMAS నా చిత్రం 'ఖత్రా' (Dangerous) లెస్బియన్ ఇతివృత్తంతో తెరకెక్కింది కాబట్టి ప్రదర్శించడానికి నిరాకరించారు. సుప్రీంకోర్టు సెక్షన్ 377ని రద్దు చేసింది. సెన్సార్ బోర్డు ఆమోదించిన తర్వాత ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. నేను, #LGBT కమ్యూనిటీ మాత్రమే కాకుండా @_PVRcinemas, @INOXCINEMAS నిర్వహణకు వ్యతిరేకంగా నిలబడాలని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. ఇది మానవ హక్కులను అవమానించడమే" అని వ‌ర్మ ట్వీట్ చేశాడు.

Next Story