'పుష్ప' రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్ చూశారా..?

Pushpa The Rise Russian trailer out now.ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'పుష్ప ది రైజ్‌'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Nov 2022 1:34 PM IST
పుష్ప రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్ చూశారా..?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'పుష్ప ది రైజ్‌'. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించాడు. ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రం అద్భుత విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా హిందీలో సైలెంట్‌గా విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది. మొత్తంగా బాక్సాఫీసు వ‌ద్ద ఈ చిత్రం రూ.350 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించింది.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని ర‌ష్యాలో విడుద‌ల చేసేందుకు చిత్ర‌బృందం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ర‌ష్య‌న్ లాంగ్వేజ్‌లోనే ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నుండ‌డం విశేషం. ఇప్ప‌టికే డ‌బ్బింగ్ ప‌నులు కూడా పూర్తి అయ్యాయి. ర‌ష్యాలో పెద్ద ఎత్తున డిసెంబ‌ర్ 8న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే అక్క‌డ ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాలు మొద‌లుకాగా.. తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే డబ్బింగ్‌ పర్‌ఫెక్ట్‌గా కుదిరినట్లు అనిపిస్తుంది.ర‌ష్య‌న్ లాంగ్వేజ్‌లో విడుద‌ల చేసిన ఈ ట్రైల‌ర్‌కు విశేష స్పంద‌న వ‌స్తోంది. కాగా.. ఆ దేశంలో స్పెషల్ ప్రీమియర్ డిసెంబర్ 1, 3 వ తేదీలలో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

Next Story