పుష్ప‌రాజ్ వ‌చ్చేది అప్పుడే.. రిలీజ్ డేట్ ఫిక్స్‌

Pushpa Releasing on December 17th.ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ న‌టిస్తున్న‌చిత్రం 'పుష్ప‌'. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Oct 2021 4:07 AM GMT
పుష్ప‌రాజ్ వ‌చ్చేది అప్పుడే.. రిలీజ్ డేట్ ఫిక్స్‌

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ న‌టిస్తున్న‌చిత్రం 'పుష్ప‌'. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బన్ని స‌ర‌సన ర‌ష్మిక మందన్న న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. దేవీ శ్రీప్రాసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్స్‌, దాక్కో దాక్కో మేక‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. రెండు పార్టులుగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అందులో తొలి భాగం 'పుష్ప ది రైజ్‌' పేరుతో క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

అయితే.. ఖ‌చ్చితంగా ఫ‌లానా తేదీని అని చెప్ప‌లేదు. తాజాగా చిత్ర‌బృందం అధికారికంగా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించేసింది. డిసెంబ‌ర్ 17న ఈచిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ఓ స‌రికొత్త పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. డిసెంబ‌ర్ 25న విడుద‌ల చేయాల‌ని ముందుగా భావించ‌గా.. భారీ బ‌డ్జెట్ చిత్రాలు ఆ రోజు విడుద‌ల అవుతున్న నేప‌థ్యంలో ఈ తేదీని ఎంచుకున్న‌ట్లు తెలుస్తోంది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ.. పుష్ప‌రాజ్ పాత్ర‌ను పోషిస్తున్నారు. సినిమాలో ర‌ష్మిక పాత్ర పేరు శ్రీవ‌ల్లి ఇటీవ‌ల వెల్ల‌డించారు. కాగా..దేవీ శ్రీప్ర‌సాద్‌-సుకుమార్‌-బ‌న్నీ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న హ్యాటిక్ చిత్రం కావ‌డంతో అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Next Story