'పుష్ప'రాజ్ ఆల్‌టైమ్ రికార్డు

Pushpa Raj teaser creates all time record. తాజాగా 'పుష్ప'రాజ్ టీజర్‌ యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్‌ను అందుకోగా 1.2 మిలియన్‌ లైక్స్‌ను సంపాదించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 April 2021 8:30 AM GMT
Pushpa Raj

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు రికార్డులు కొత్త కాదు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'పుష్ప‌'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇటీవ‌ల బ‌న్ని పుట్టిన రోజు సంద‌ర్భంగా 'ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్' పేరుతో టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఇందులో ఊర‌మాస్ లుక్‌లో క‌నిపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు బ‌న్నీ. అంతేకాదు దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. దీంతో ఈ వీడియో ఇంట‌ర్నెట్‌లో రికార్డు మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది.

తాజాగా ఈ టీజర్‌ యూట్యూబ్‌లో 50 మిలియన్ల వ్యూస్‌ను అందుకోగా 1.2 మిలియన్‌ లైక్స్‌ను సంపాదించింది. 50 మిలియన్ల వ్యూస్‌ మార్క్‌ను షార్ట్ టైంలో చేరుకున్న తెలుగు టీజర్‌గా 'పుష్ప' రికార్డుకెక్కింది. ఈ విష‌యాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ త‌మ ట్విట్ట‌ర్ లో ప్ర‌క‌టించింది. దీంతో బ‌న్నీ అభిమానులు పుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఆర్‌ఆర్‌​ఆర్‌లోని రామరాజు ఫర్‌ భీమ్‌ వీడియో 50 మిలియన్ల వ్యూస్‌ను చేరుకునేందుకు 6 నెలలు పట్టింది. కానీ బన్నీ మాత్రం కేవలం 20 రోజుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం.

రశ్మిక హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ ప్రతినాయకుడుగా క‌నిపించ‌నున్నాడు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తెర‌కెక్కుతోంది. బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు.


Next Story
Share it