'పుష్ప' సెకండ్ పార్ట్ టైటిల్ ఇదే..!
Pushpa Part 2 Title Revealed.ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
By తోట వంశీ కుమార్ Published on 17 Dec 2021 8:28 AM ISTఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బన్ని సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కింది. తొలి భాగం 'పుష్ప ది రైజ్' పేరుతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రెండో భాగం ఏ పేరుతో వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఆ పేరును రివీల్ చేశాడు. తొలి భాగం చివర్లో రెండో భాగం ఏ పేరుతో రానుందో చెప్పేశాడు.
'పుష్ప-ద రూల్' అనే పేరుతో రెండో భాగం రానున్నట్లు చూపించేశాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం రానుంది. ఈ చిత్రంలో సమంత స్పెషల్ పాటలో నర్తించగా.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఎర్రచందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కిన నేపథ్యంలో మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో జరిగింది.
పుష్ప' కోసం అడవుల్లో రోజూ 500 మందికి పైగా పనిచేవారట. ఇక ఈ సినిమాలో ఓ పాటను దాదాపు 1000మందితో చిత్రీకరించారు. ఇక దాదాపు రెండు గంటల సమయం మేకప్ కోసం కేటాయించాల్సి వచ్చేదని చిత్రబృందం తెలిపింది. ఉదయం 4.30గంటలకు నిద్రలేచి.. 5 నుంచి 7 గంటల వరకు మేకప్ కోసమే ఓపిగ్గా కూర్చోవాల్సి వచ్చేదని.. ఆ రోజు షూటింగ్ ముగిసాక ఆ మేకప్ తీయడానికి మరో 20 నుంచి 40 నిమిషాలు పట్టేదన్నారు.